దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దీపావళి పండుగ ( అక్టోబర్​ 31)  రోజు ఐదు యోగాలు ఏర్పడ్డాయి.   శని, గురుడు   అక్టోబర్​ 31న దీపావళి రోజున వక్రీకరణ బాట పట్టారు.  దీని ప్రభావంతో  గజకేసరి యోగం, దీప యోగం, శశ మహాపురుష యోగం, బుధాదిత్య యోగం, గజకేసరి రాజయోగం ఏర్పడ్డాయి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  దీప యోగం కారణంగా వృషభ రాశి, ధనస్సు రాశి, కుంభరాశుల  వారికి  విపరీతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి.  మిగతారాశుల వారికి ఎలా ఉందో  తెలుసుకుందాం.... 

ఏడాదికొకసారి దేవ గురువు బృహస్పతి గ్రహం ... అలాగే రెండున్నర సంవత్సరాలకు శని గ్రహం ఒక సారి నుంచి మరో రాశిలోకి మారతారు. అయితే దీపావళి రోజున ( అక్టోబర్​ 31).. ఆ రెండు గ్రహాలు తిరోగమనంలో సంచరించడం వలన డిసెంబర్​ 31 వరకు  12 రాశుల వారి జీవితచక్రంలో  అనుకోని  మార్పులు సంభవిస్తాయి.  

మేషరాశి:  శని, గురుడు  వక్రీకరణ మార్గంలో  సంచరించడం వలన మేషరాశి వారికి ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతుతన్నారు.   ఉద్యోగులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం.  ఆర్ధికవిషయాల్లో కొంత పురోగతి ఉంటుంది.  ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి.  విద్యార్థులకు కెరీర్​ పరంగా బాగుంటుంది.  వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టేందుకు ఇది అనుకూల సమయం. . .ఆరోగ్య పరంగా బాగుంటుంది. 

వృషభరాశి:  గురుడు , శని తిరోగమన సంచారం వలన వృషభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్థులు ఎదుర్కొంటున్న  సమస్యలు తొలగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడంతో .. ఆర్థిక సమస్యలు గట్టుక్కుతాయి.  వ్యాపారస్తులకు  అధిక లాభాలు వస్తాయి.  కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం.  కుటుంబ సమస్యలు పరిష్కరించబడతాయి.  పెండింగ్​ పనులు పూర్తిఅయ్యే అవకాశం ఉంటుంది. 

మిథునరాశి:    గురుడు , శని తిరోగమనం ప్రయోజనకరంగా మిథున రాశి వారికి ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందడంతో పాటు....  పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  అధికారికంగా విదేశీ పర్యటనలుంటాయి.  విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపార విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి.  వ్యాపారస్తులకు అమితమైన లాభాలు వస్తాయి.  ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటకరాశి:  శని, బృహస్పతి గ్రహాల దిశ మారడంతో  కర్కాటక రాశికి  చెందిన వ్యక్తులకు  అదృష్టం వరిస్తుంది.  ఇప్పటి వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల నుంచి విముక్తి  కలుగుతుంది.  కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  ఉద్యోగస్తులకు అనుకోని శ్రమ కలుగుతుంది,  కార్యాలయంలో అందరి మన్ననలు పొందుతారు.   విద్యార్థులకు సామాన్య ఫలితాలుంటాయి. 

సింహరాశి: శని, బృహస్పతి తిరోగమనంలో సంచరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.  ఉద్యోగం కోసం సెర్చ్​ చేస్తున్న వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారంలో పురోగతితో పాటు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం.  వృత్తి.. వ్యాపారాల్లో లాభాలుంటాయి.  విద్యార్థులకు కెరీర్​ పరంగా ఇంది మంచి సమయం.  పెండింగ్​ సమస్యలు పరిష్కారమవుతాయి.  ఆర్థికంగా పురోగతితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.  

కన్యారాశి:  బృహస్పతి... శని గ్రహాలు తిరోగమనంలో సంచరించడం వలన కన్యారాశి వారు   ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. అకస్మాత్తుగా ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులను పొందుతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు..

తులారాశి:  గురుడు ... శని గ్రహాలు దిశ మార్చుకోవడంతో తులా రాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది,  ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకుంటారు,  ఉద్యోగులకు ప్రమోషన్​.... ఇంక్రిమెంట్​ వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది.  అయితే పెద్దల ఆరోగ్యం ఎడల జాగ్రత్తగా ఉండాలి.  వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాల బాట పడతారు.  ఇప్పటి వరకు మందకొడిగా సాగుతున్న వ్యాపారం ఊపందుకుంటుంది. 

వృశ్చిక రాశి:  శని,  గురుడు  రివర్స్ కదలిక వలన వృశ్చికరాశి రాశికి చెందిన వ్యక్తులు  ధనవంతులు అవుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి. . అంతేకాదు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి .. వ్యాపారాల్లో అభివృద్ది ఉంటుంది.  ఆరోగ్య పరంగా నరాల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.  వాహనాలు డ్రైవింగ్​ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

 ధనస్సురాశి:  గురుడు, శని గ్రహాలు తిరోగమన సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు అన్ని సందర్భాలలో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మెరుగుదలకు అవకాశం ఉంటుంది. పనికి తగిన ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

మకరరాశి:  గురుడు , శని.. తిరోగమనంలో సంచరించడం వలన మకరరాశి వ్యక్తుల జీవితాల్లో.. సౌకర్యాలు పెరుగుతాయి.  కొత్తగా వాహనం కొనే అవకాశం ఉంది.  కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారస్తులకు  లాభాలు వస్తాయి.  కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. షేర్​ మార్కెట్​ వ్యాపారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.  

కుంభరాశి: శని, బృహస్పతి గ్రహాల తిరోగమన సంచారం కారణంగా ఏర్పడే దీపయోగంతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖర్చులు తగ్గుతాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంపద పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది కుంభ రాశి వారికి అదృష్ట కాలం.

మీనరాశి:  శని, గురుడు  తిరోగమనంలో ఉండటం వలన మీన రాశివారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.  ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు.  మీనరాశి జాతకులు బియ్యం దానం చేసి దక్షిణ .. తాంబూలం ఇచ్చి.. కష్టాల నుంచి ఉపశమనం పొందండి.  ఉద్యోగస్తులకు ఇది కఠినమైన కాలం.  కొత్త ప్రయత్నాలు కొన్ని రోజులు వాయిదా  వేసుకోండి.  ఆరోగ్య పరంగా మిశ్రమఫలితాలు ఉంటాయి.  విద్యార్థులు కష్టపడితేనే ఫలితం పొందుతారు.వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం రాదు.  ప్రతి విషయంలోనూ ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి.